News

Realestate News

జిల్లాలో బంద్‌ ప్రశాంతం

బంద్‌ ప్రశాంతం
జిల్లాలో బంద్‌ ప్రశాంతం
రహదారులపై ఆందోళనలకు దిగిన పలు పార్టీలు
న్యూస్‌టుడే బృందం
దుకాణాలు మూతపడ్డాయి… రహదారులు నిర్మానుష్యం అయ్యాయి… కార్యాలయాలు బోసిపోయాయి… ఎక్కడ చూసినా హోదా మాట మారుమోగింది… కూడళ్లు పిక్కటిళ్లేలా దిల్లీకి వినపడేలా తమ గళాన్ని వినిపించారు ప్రజలు… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యేక హోదా సాధన సమితి సోమవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి వైకాపా, వామపక్షాలు, ఇతర సంస్థలు మద్దతు పలికాయి. తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రహదారులపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రహదారులపై బైఠాయించి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, కార్యాలయాలను మూసివేయించారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ ప్రభావం జరిగింది. కొన్నిప్రాంతాల్లో స్వచ్ఛందంగానే దుకాణాలు మూసివేసి వ్యాపారులు తమ మద్దతు తెలియజేశారు. ఆయా ఆందోళనల సమాహారం చిత్రమాలిక ఇది..ప్రత్యేక హోదా సాధనకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద వైకాపా, కాంగ్రెస్‌, జనసేన, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo