జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

గాజువాక, న్యూస్‌టుడే: జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
పశ్చిమ బంగా రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన
ఆరుగురు విద్యార్థులు ప్రతిభ చాటారు.
నగరానికి చెందిన నితీష్, వివేక్, కార్తీక్, చక్రధర్, సాయి, రేవంత్‌లు నాలుగు బంగారు పతకాలు, ఆరు వెండి, ఒక రజత
పతకం సాధించారు.
ఈ సందర్భంగా శనివారం గాజువాకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కరణంరెడ్డి నర్సింగరావు విజేతలను అభినందించి మెమొంటోలు,
సర్టిఫికేట్లు అందజేశారు.
జిల్లాకు గుర్తింపు తెచ్చిన వీరిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జాతీయ కోచ్ సుమన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.