News

Realestate News

జాతి ఖ్యాతి మనదే

జాతి ఖ్యాతి మనదే
దివిలో విశ్వరూపం.. భువిలో విజయ గర్వం
విశాఖపట్నం, ఈనాడు
నింగిలో అద్భుతం.. నేలలో విజయ దరహాసం.. ఈ పరిస్థితి బుధవారం ఆవిష్కృతమయ్యింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి అగ్రదేశాలకు సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకోవడంతో భారతావని పులకించింది.. ఆ హర్షధ్వానాలు.. అభినందనల హోరు జిల్లావ్యాప్తంగా వినిపించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సాగిన ప్రయోగం ప్రత్యక్ష ప్రసారాన్ని కనులారా వీక్షించిన జిల్లావాసులు చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే నూతన అధ్యాయానికి తెరలేపిన ఇస్రో శాస్త్రవేత్తల కృషికి సాహో.. అన్నారు. 104 ఉప గ్రహాలతో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహన నౌక విజయవంతంగా దూసుకెళ్లి.. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోని ప్రవేశపెట్టడంతో విజయానందం పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

ఇది గర్వపడే రోజు..
– చిరువోలు శ్రీకాంత్‌, డీఐజీ, విశాఖ రేంజి
ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ ప్రయోగంతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశ ఖ్యాతి ఉన్నతస్థాయికి వెళ్లింది. అన్నిరంగాలతోపాటు మానవాళికి ఇలాంటి ప్రయోగాలు ఎంతో మేలు చేస్తాయి.. ఇదే స్ఫూర్తితో దేశ ప్రతిష్ఠ పెంచే దిశగానే ప్రతి ఒక్కరూ కృషిచెయ్యాలి.

ఉప్పొంగిపోయాం..
– రెడ్డి శ్రీరాములు నాయుడు, ప్రాంతీయ సంచాలకులు, పర్యాటక శాఖ
ఇస్రో సాధించింది ప్రపంచంలోనే గొప్ప విజయం.. ప్రత్యక్ష ప్రసారం చూసి గర్వంతో ఉప్పొంగిపోయాం. క్రికెట్‌లో కప్పు సాధిస్తేనో.. సినిమాలు హిట్టయితేనో.. ఏదో సాధించామని గర్వంగా చెబుతాం.. ఇది అంతకుమించిన విజయం.. యావత్‌ భారత జాతి గర్వంగా చెప్పుకోదగ్గ విజయం.. మన దేశానికి మంచి భవిష్యత్తు ఉందని ఈ ప్రయోగం మరోమారు నిరూపించింది. నా కుమారుడు ధీరేష్‌ ఐఐటీ చెన్నైలో ఏరో స్పేష్‌ విభాగంలో పరిశోధన చేస్తున్నాడు.. వాడూ ఇలాంటి పరిశోధనలో మున్ముందు భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

అద్భుత విజయం..
– డాక్టర్‌ గుమ్మల సృజన, జిల్లా సంయుక్త కలెక్టర్‌
ఇదో అద్భుత విజయం.. ఒకేసారి 104 ఉప గ్రహాలు ప్రయోగించి రికార్డు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభకు అందరం శిరస్సు వంచి నమస్కరించాలి. అంకితభావం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. నేటి, రేపటి తరం పరిశోధనల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే దేశాభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తులు ఎలా సాధించాలన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.. శాస్త్ర, సాంకేతిరంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరిశోధనలు మరిన్ని జరగాలి. అప్పుడే దేశ ప్రతిష్ఠ మరింత పెంచినవాళ్లమవుతాం.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo