జయప్రదం గిరి ప్రదక్షిణం
హరినామ స్మరణతో పులకించిన సింహగిరి
న్యూస్‌టుడే, అడివివరం, సింహాచలం

వేకువజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇళ్లకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి మెట్లమార్గంలో భక్తులను కొండపైకి వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు. కిందకి వచ్చే భక్తులను ఘాట్‌రోడ్డు నుంచి పంపడంతో మెట్లమార్గంలో రద్దీ తగ్గింది. ఉచిత దర్శనం భక్తులకు వేగంగా దర్శనాలు కల్పించడంలో దేవస్థానం అధికారుల ప్రణాళిక ఫలించింది.
దొర్లిపడితే… పొర్లుదండాలే…
సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండచుట్టూ 32 కిలోమీటర్లు నడిచి అలసిపోయారు. సింహాచలం కొండపై నుంచి తిరుగుముఖం పట్టే సమయంలో ఎంత దగ్గర దారి ఉంటే అంత మంచిదని కొంతమంది భక్తులు కొండపై నుంచి అడ్డదారుల్లో పయనించారు. ఇలా వెళ్లడం ప్రమాదమని తెలిసినా అత్యధికులు అదే బాట పట్టారు.

చిత్రాలు : నాయుడు, ఈనాడు