‘జన్ ఆహార్’ ప్రారంభం

సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులతో పాటు అన్ని తరగతులకూ అందుబాటు ధరలతో అల్పాహారం, భోజన సదుపాయం కల్పించే ‘జన్ ఆహార్’ భోజన శాల గురువారం విశాఖ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. స్టేషన్ మేనేజర్లు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా పలువురు ప్రయాణికులు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ జన్ ఆహర్కు వెళ్లి ఆహార పదార్థాలను రుచిచూశారు. భారతీయ రైల్వే కేటరింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో లీజు పొందిన జన్ ఆహార్ ధరల పట్టీ స్థానికులను ఆకట్టుకుంది. ఈ హోటల్లో కనీస ధర టీ రూ.7 నుంచి భోజనం రూ.60ల వరకు ధరల పట్టీని ఏర్పాటు చేశారు.