జగన్నాథ రథోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం
జగన్నాథ రథోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం
టౌన్‌కొత్తరోడ్డు ప్రాంతంలో కొలువైన శ్రీజగన్నాథస్వామి రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశామని కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
24న ఉదయం: నేత్రోత్సవం. సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, అనంతరం ప్రతిష్ఠాంత సుభద్రాదేవి శాంతి కల్యాణం.
25న ఉదయం 8.45 గంటలకు: స్వామివారిని రథంపై నెలకొల్పుతారు. సాయంత్రం 5.45 గంటలకు తొలి రథయాత్ర ఉత్సవ ప్రారంభం. తొమ్మిదిరోజుల పాటు గుండిచా దేవి ఆలయమైన టర్నర్ సత్రంలో స్వామివారి దశవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
జులై 5: తిరుగు రథయాత్రతో వేడుకల ముగింపు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రతిరోజు 50 మంది దేవాదాయశాఖ సిబ్బంది, 150 మంది సేవకులు విధులు నిర్వహిస్తారని ఈవో తెలిపారు.
ప్రతిరోజు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మధ్యాహ్నం నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఈవో జగన్నాథరావు, ప్రధాన అర్చకుడు జగన్నాధాచార్యులు, అర్చకుడు సురేష్‌బాబు, ఉత్సవ అధికారి బీవీఆర్ ప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.