News

Realestate News

చింతపల్లి కేంద్రంగా రాజ్‌మా విత్తనోత్పత్తి

Real Estate News Vizag

చింతపల్లి కేంద్రంగా రాజ్‌మా విత్తనోత్పత్తి
చింతపల్లి, న్యూస్‌టుడే
న్యంలో విత్తన కొరత కారణంగా అంతరించిపోతున్న రాజ్‌మా పంట అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు, చింతపల్లి కేంద్రంగా రాజ్‌మా విత్తనోత్పత్తికి ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జి.జోగినాయుడు చెప్పారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో రాజ్‌మా సాగుపై ఎంపిక చేసిన గిరిజన రైతులతో శుక్రవారం సమావేశం, క్షేత్ర ప్రదర్శన జరిగింది. ఏడీఆర్‌ మాట్లాడుతూ.. మన్యంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రాజ్‌మా కొన్నేళ్లుగా పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. సంప్రదాయ పంటగా ఒకప్పుడు రైతులు పండించే రాజ్‌మా వాణిజ్య పంటగా ఖ్యాతికెక్కిందన్నారు. వాణిజ్య ప్రాధాన్యమున్న ఈ పంటను ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దిగుబడులు తగ్గడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, చిలకడ దుంపల వైపు మళ్లారన్నారు. రైతులంతా ఏళ్ల తరబడి రాజ్‌మా సాగు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విత్తన కొరత తీవ్రంగా ఉందన్నారు. దీన్ని నివారించేందుకు ఈ ఏడాది నుంచి చింతపల్లి పరిశోధనా కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా రాజ్‌మా విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాన్పూర్‌లోని పప్పు దినుసుల పరిశోధన కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన మేలురకం రాజ్‌మా విత్తనాలతోపాటు ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాలను స్థానికంగా అభివృద్ధి చేసి విత్తనోత్పత్తి చేపడతామన్నారు. ఈ విత్తనాలను ఐటీడీఏ, వ్యవసాయ శాఖ సిఫార్సులతో గిరిజన రైతులకు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచీ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు వంటి పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై సేద్యపు విభాగం శాస్త్రవేత్త దేశగిరిశేఖర్‌ రైతులకు వివరించారు. విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ దాడి ఉమామహేశ్వరరావు, శాస్త్రవేత్తలు శివదేవిక, విజయదుర్గా, బాబూజీనాయుడు, ప్రవీణ్‌ ఏఈవో బాబూరావుదొర తదితరులు పాల్గొన్నారు. పలు మండలాలకు చెందిన గిరిజన రైతులు హాజరయ్యారు.

మన్యానికి మరో కొత్త అతిథి
పైౖలట్‌ü ప్రాజెక్టుకు ఇక్రిశాట్‌ శ్రీకారం
చింతపల్లి, న్యూస్‌టుడే
రాను రాను మన్యంలో అంతరించిపోతున్న రాజ్‌మా సాగుకు మంచి రోజులు రానున్నాయి. రైతు కోసం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ మన్యంలో ఈ ఏడాది రాజ్‌మాసాగు అభివృద్ధికి రూపకల్పన చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, విత్తన కొరత కారణంగా రాజ్‌మా సాగును గిరిజన రైతులు వదులుకుంటున్న దశలో ఇక్రిశాట్‌ బెంగళూరులో అభివృద్ధి చేసిన ‘ఆర్కాకోమల్‌’ రాజ్‌మా విత్తనాలను గిరిజన రైతులకు రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఈ విత్తనాలను మన్యసీమ స్వచ్ఛంద సంస్థ ద్వారా బూసులకోట గ్రామంలో ఎంపిక చేసిన గిరిజన రైతులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఇక్రిశాట్‌ సైంటిఫిక్‌ అధికారి సందీప్‌నాయక్‌ మాట్లాడుతూ.. మన్యంలో ఇప్పటివరకూ సంప్రదాయక రకాలైన రాజ్‌మా ఎరుపు, తెలుపు, చింతపల్లి రెడ్‌, బిన్నిస్‌ రకాలనే రైతులు విత్తనాలుగా వినియోగిస్తున్నారన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఆర్కాకోమల్‌ రకం రాజ్‌మా కొండ ప్రాంతాల్లోని పోడు భూముల్లో సాగు చేసేందుకు అనువైనదిగా పరిశోధనల్లో గుర్తించామన్నారు. ఈ విత్తనాన్ని రైతుల పొలాల్లోనే అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తొలిసారిగా 750 కిలోల విత్తనాలను తీసుకువచ్చామన్నారు. వీటి ధర కిలో రూ.250 కాగా గిరిజన రైతులకు కిలో రూ.50కి పంపిణీ చేశామన్నారు. 25 ఎకరాల్లో రైతులతో ఈ కొత్త రకం రాజ్‌మాను పండించి ఆ పంటను విత్తనాలుగా మళ్లీ అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అంజలీశనివారం సర్పంచి రమణమ్మ, గ్రామపెద్ద పోతురాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బాలరాజు, మన్యసీమ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త నూకరాజు తదితరులు పాల్గొన్నారు.