News

Realestate News

‘చదువుకోవడానికి ఆడుకుందాం’

vsp-brk8a

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఆల్‌ ప్రోగ్రామ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో మూడు వేల మంది పిల్లలు ఆదివారం విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగిన ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ జట్ల మ్యాచ్‌ను తిలకించారు. వీరందరికీ స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఈ పిల్లలందర్నీ స్టేడియానికి బస్సుల్లో తీసుకొచ్చి, భోజన, మంచినీటి వసతి కల్పించి ఉచితంగా మ్యాచ్‌ను తిలకించే విధంగా చర్యలు తీసుకున్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ముంబై ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ చిన్నారులతో గ్యాలరీలో కూర్చుని కొంత సేపు మ్యాచ్‌ను తిలకించారు. ‘చదువుకోవడానికి ఆడుకుందాం’ అనే నినాదాలతో కూడిన ఫెక్సీలు ఈ సందర్భంగా స్టేడియంలోని గ్యాలరీల్లో ఏర్పాటు చేయడంతో వాటిని అభిమానులను తిలకించారు. పిల్లలతో సచిన్‌ తెందూల్కర్‌, నీతా అంబానీ ఉన్న ఫొటోలు అభిమానులను ఆకర్షించాయి. గత ఆరేళ్లుగా మంచి విద్యను అందించడంతో పాటు కనీస అవసరాలు తీర్చే విధంగా రిలియన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఆల్‌ ప్రోగ్రామ్స్‌ పని చేస్తుందని ఈ సందర్భంగా నీతా అంబానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Source : http://www.eenadu.net/

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo