News

Realestate News

చదరపు గజం రూ. 6 వేలు

Development works groundbreakings

దాకమర్రి లేఅవుట్‌లో ఎల్‌ఐజీ ప్లాట్ల ధర ఖరారు
దరఖాస్తుకు గడువు అక్టోబరు 14 అక్టోబరు 26న లాటరీ
కేవలం అల్పాదాయ వర్గాలకే పరిమితం

ఒక కేటగిరీలో 183.83 చదరపు గజాల చొప్పున 35 ప్లాట్లకు విజేతలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. చదరపు గజం విలువ రూ. 6 వేల చొప్పున లెక్కిస్తే ప్లాట్‌ ధర రూ. 11,02,980 అవుతుంది. రెండో కేటగిరీలో 166.66 చదరపు గజాల చొప్పున 137 ప్లాట్లకు లాటరీ తీస్తారు. ఒక్కో ప్లాట్‌ విలువ రూ. 9,99,960.లాటరీలో ఎంపిక కాగానే డబ్బును వుడాకు చెల్లించాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించాలా? వాయిదాల్లో జమ చేయాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదు.దాకమర్రి లేఅవుట్‌లో అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) ప్లాట్లలో చదరపు గజం ధర రూ. 6 వేలుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని బుధవారం వుడా కార్యాలయంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మొత్తం 172 ప్లాట్లను లాటరీ పద్ధతిలో అల్పాదాయవర్గాలకు కేటాయిస్తారు. ఇందులో 183.83 చదరపుగజాల్లోని ప్లాట్లు 35, 166.66 చదరపు గజాల్లోని ప్లాట్లు 137 ఉన్నాయి. ప్రయివేటు భాగస్వామ్యంతో వుడా ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హెచ్‌ఐజీ, ఎంఐజీకి చెందిన 93 స్థలాలను వేలం పద్ధతిలో విక్రయించింది. ఈ పద్ధతిపై ఇటీవల ‘ఈనాడు’లో కథనాలు వచ్చిన నేపథ్యంలో రెండు కేటగిరీల్లోని 172 ఎల్‌ఐజీ

ప్లాట్లకు లాటరీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే లేఅవుట్‌లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం నిర్దేశించిన 256 ప్లాట్లను కలెక్టరుకు అప్పగిస్తారు. వీటిని పేదలకు ఎలా కేటాయించాలన్నదానిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా వివరించారు.

ఎల్‌ఐజీ ప్లాట్లకు దరఖాస్తులు చేసేదిలా…. ్త లాటరీ పద్ధతిలో కేటాయించే 172 ప్లాట్ల కోసం వుడా అధికారులు వచ్చే నెల 12న ప్రకటన విడుదల చేస్తారు. ్త వుడా ఉపాధ్యక్షుడి పేరుతో రూ. 500 డిమాండు డ్రాఫ్టు తీసుకొని సిరిపురంలోగల వుడా కార్యాలయంలో సంప్రదిస్తే దరఖాస్తులు జారీ చేస్తారు. ్త వుడా కాంప్లెక్సులోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు (ఐఓబీ)లో డీడీలు తీసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ్త పూరించిన దరఖాస్తులను తిరిగి అక్టోబరు 14 సాయంత్రం 5 గంటల్లోపు వుడా కార్యాలయంలో అందజేయాలి. ్త అదే నెల 26న ఏయూ స్నాతకోత్సవ మందిరంలో లాటరీ తీసి విజేతలను ఎంపిక చేస్తారు.

అర్హులు ఎవరు? ్త వార్షికాదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల్లోపు కలిగిన కుటుంబాలు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. స్థానిక తహసిల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణపత్రం కచ్చితంగా సమర్పించాలి. ్త ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు కలిగి ఉండాలి. ్త తహశిల్దార్‌ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థల్లో పని చేస్తుంటే వేతన ధ్రువీకరణ పత్రం, ఉద్యోగ విరమణ చేస్తే పింఛను ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ్త దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని వారై ఉండాలి. ్త ఇప్పటికీ స్థలం, సొంత ఇల్లు లేనట్లుగా నోటరీ చేయించాలి. ్త ప్రభుత్వం నుంచి ఇదివరకే స్థలం, ఇళ్లు వంటివి కలిగి ఉండరాదు. ్త రిజర్వేషన్‌ వంటివి వర్తించే పరిస్థితి ఉంటే, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కూడా దరఖాస్తుతోపాటు జత చేయాలి.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo