News

Realestate News

చదరపు గజం రూ. 14,600

vizag news

దాకమర్రి లేఅవుట్‌లోని ప్లాట్లకు వుడా వేలం
మొదటి రోజు ఆదాయం రూ. 12.70 కోట్లు
ఈనాడు – విశాఖపట్నం

వుడా ప్రయివేటు సంస్థ భాగస్వామ్యంతో వేసిన దాకమర్రి లేఅవుట్‌లో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ. 14,400… సరాసరి ధర రూ. 12,500 తొలి రోజు వేలంలో అమ్ముడయిన స్థలాలు 40 దాకమర్రి లేఅవుట్‌ స్థలాల విక్రయాల్లో మొదటి రోజు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) రూ. 12.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రయివేట్‌ భాగస్వామ్యంతో వుడా అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌లో 130 ప్లాట్లకు సోమవారం నుంచి మూడు రోజులపాటు వేలం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్నాతకోత్సవ మందిరంలో ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఎంఐజీ-1, 3 కేటగిరీల్లో 48 ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. వీటిలో 40 ప్లాట్లను దరఖాస్తుదారులు పోటీపడి దక్కించుకున్నారు. 8 ప్లాట్లకు దరఖాస్తుదారుల నుంచి స్పందన లేకపోవడంతో వీటిని తాత్కాలికంగా పక్కనపెట్టారు.
* వేలంలో వెళ్లిన 40 ప్లాట్లలో వుడా నిర్ణయించిన చదరపు గజం కనీస ధర రూ. 10 వేలు. దరఖాస్తుదారులు కొన్ని ప్లాట్ల కోసం గరిష్ఠంగా రూ. 14,600 ధరకు వెళ్లారు.
* మిగతా ప్లాట్లకు సరాసరి రూ. 12,500 ధర పలికింది.
* అధికారులు వూహించిన కంటే ఎక్కువ ధర వచ్చినట్లయింది. కనీస ధర రూ. 10 వేలు ఎక్కువన్న ఉద్దేశంతో చాలామంది వెనుకడుగు వేశారు. దాకమర్రి లేఅవుట్‌ ప్రాధాన్యాన్ని వుడా వివరిస్తూ వుడా పెద్దఎత్తున ప్రచారం చేయడంతో చివరిలో స్పందన వచ్చింది.

సోమవారం ఉదయం 10 గంటలకు వేలాన్ని వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వి.బాబూరావునాయుడు ప్రారంభించారు. మొదటి ప్లాట్‌ (నం:58, 300 చ.గ) గంట్ల రవికుమార్‌ చ.గ.రూ. 13,100 ధరకు దక్కించుకున్నారు. రెండో ప్లాట్‌ (నం:57, 300 చ.గ) బలగ శ్రావణి చ.గజం స్థలాన్ని రూ. 12,600 ధరకు సొంతం చేసుకున్నారు. మూడో ప్లాట్‌ (నం:59, 300 చ.గ.)ను హోరాహోరీ పోటీ మధ్య జ్యోత్స్న దొర చ.గ. రూ. 13,600 ధరకు దక్కించుకున్నారు. ఈ ప్లాట్‌ కోసం పేడాడ రామానాయుడు, జ్యోత్స్న దొర తీవ్రంగా పోటీ పడ్డారు. రాత్రి 7 గంటల వరకు వుడా అధికారులు వేలం ప్రక్రియను నిర్వహించారు. దాదాపు 200 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. వుడా అదనపు ఉపాధ్యక్షుడు కె.రమేశ్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ (సీయూపీ) బి.రామతీర్థ, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్‌, డీఎఫ్‌ఓ రాజారావు, ప్రణాళిక విభాగ అధికారి వెంకటసుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo