News

Realestate News

చదరపు గజం ఎంత?

Development works groundbreakings

ఎల్‌ఐజీ ప్లాట్ల లాటరీపై నేడు ప్రకటన
ఈనాడు – విశాఖపట్నం

అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) కోసం దాకమర్రి లేఅవుట్‌లో చదరపు గజానికి కనిష్ఠ ధర ఎంత నిర్ణయిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అత్యధిక ఆదాయ వర్గాల (హెచ్‌ఐజీ), మధ్య తరహా ఆదాయ వర్గాల (ఎంఐజీ) వర్గాల కోసం నిర్వహించిన వేలంలో చదరపు గజం ధర రూ. 10 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుదారుల మధ్య పోటీ, స్థల గిరాకీని బట్టి గరిష్ఠంగా చ.గ. ధర రూ. 16,500 వరకు వెళ్లింది. రెండు కేటగిరీల్లో సరాసరిగా చదరపు గజం రూ. 13 వేల ధర పలికినట్టు వుడా వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే ఎల్‌ఐజీ ప్లాట్‌ ధర కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ధరను బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయించి వివరాలను మీడియాకు వెల్లడించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన పరిశీలన కోసం మూడు ధరలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

దాకమర్రిలో ప్రభుత్వ ధర చదరపు గజం రూ. 3,500 వరకు ఉంది. హెచ్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్ల వేలంలో సరాసరి రూ. 13 వేలకు వెళ్లినందున, మధ్యే మార్గంలో ఒక ధరను నిర్ణయించనున్నారు. రూ. 7 వేల నుంచి రూ. 9 వేల మధ్య ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఎల్‌ఐజీ కేటగిరీలో దాదాపు 172 ప్లాట్లకు లాటరీ నిర్వహించే అవకాశం ఉంది. ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 160 నుంచి 190 చదరపు గజాలు ఉంటుందని అంచనా. దరఖాస్తు ధర రూ.1,200గా నిర్ణయించే అవకాశాలున్నాయి.