ఘోషాసుపత్రిలో మరో వంద పడకలకు ఏర్పాట్లు!
రూ. 20 కోట్లతో మాతాశిశు బ్లాక్ నిర్మిస్తాం
సీమాంక్ బ్లాక్ ప్రారంభోత్సవంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య
* ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజుకు 250 వరకూ ఉంటోంది. ప్రస్తుతం ఉన్న 147 పడకలు చాలడం లేదు. మరో 100 పడకలు పెంచడానికి చర్యలు తీసుకుంటాం.
* రూ. 20 కోట్లతో మాతాశిశు బ్లాక్(ఎంసీబీ) ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వుడా నుంచి రూ.5 కోట్లు, మిగతా సొమ్మును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేకరిస్తాం. అప్పటికీ చాలకపోతే రాష్ట్ర ప్రభుత్వం సాయం తీసకుంటాం.
* అగ్నిప్రమాదంలో బూడిదైన సీమాంక్ బ్లాక్‌ను పునరుద్ధరించడానికి రూ. 54 లక్షలకు పైగా ఖర్చు చేశాం. వీటిలో విద్యుత్తు పనులకు రూ. 8.90 లక్షలు, నిర్మాణాలకు రూ.5 లక్షలు, వైద్య పరికరాలకు రూ.40 లక్షలు ఖర్చయ్యాయి.
* త్వరలో ఆసుపత్రిలో ఎస్ఎన్సీయూ విభాగంలో మాతా, శిశు సంరక్షణ కోసం కంగారు మదర్ కేర్ యూనిట్‌ను ప్రారంభిస్తాం. ఇందుకు గాను రూ.10 లక్షలు కేటాయించాం.
* ఘోషాసుపత్రిలో ప్రస్తుతం విద్యుత్ 47 కేవీ సామర్థ్యం ఉంది. దీనికి మించి ఆసుపత్రిలో విద్యుత్ వినియోగమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా హైటెన్షన్‌కు మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకుగాను 315 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తాం. దీనికి రూ.28 లక్షలు మంజూరు చేస్తాం. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే మాతాశిశు బ్లాక్(ఎంసీబీ) యూనిట్‌కు కూడా ఈ విద్యుత్ సరిపోతుంది.
* ఆసుపత్రికి రెండు ఎలక్ట్రీషియన్ పోస్టులను కూడా మంజూరు చేస్తాం.
* ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం తదితర ప్రాంతాల్లో పురాతన వైరింగ్ మార్చి దాని స్థానంలో రూ. 9 లక్షలతో హెచ్‌టీ కన్వర్షన్‌కు సరిపడా వైరింగ్‌ను చేయిస్తాం.
* ఘోషాసుపత్రికి అదనంగా ఒక అంబులెన్స్‌ను కూడా మంజూరుచేస్తాం.
* ఆసుపత్రి ఆవరణలో సీసీ రహదారుల మెరుగుకు రూ.22.60 లక్షలు ఖర్చు చేస్తాం.