ఘనంగా శ్రీరామనామ జపయజ్ఞం
ఘనంగా శ్రీరామనామ జపయజ్ఞం
విశాఖపట్నం, న్యూస్లుడే: యోగ భారతి ట్రస్టు ఆద్వర్యంలో శ్రీరామనామ జపయజ్ఞం కార్యక్రమం ఆళ్వార్‌దాస్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ మాట్లాడుతూ అన్ని మతాలకు మూలం హిందు మతమనే విషయాన్ని వివేకానందస్వామి చికాగో పేర్కొన్నారన్నారు. ప్రపంచానికి సంస్కృతిని అందించిన ఘనత భారతదేశానిదన్నారు. శ్రీరాముడు ఆరాధ్యదైవమన్నారు. కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద సరస్వతి స్వామీ మాట్లాడుతూ శ్రీరాముడు ఒక మహాశక్తి అన్నారు. డిసెంబరులో హైదరాబాద్‌లో లక్షమందితో హనుమాన్‌చాలీసా, శ్రీరామనామజపయజ్ఞం జరుపుతున్నామన్నారు. విశాఖలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో యోగా భారతి ట్రస్టు వ్యవస్థాపకుడు పైడింనాయుడు, ఉమామహేశ్వరరావు, సిఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ, ఎమ్మెల్సీ మాధవ్, భాజపా నాయకులు పి.వి.చలపతిరావు, ఇండియన్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి పవన్, కనకమహాలక్ష్మీ దేవస్థానం ఈవో జ్యోతి మాధవి తదితరులు ప్రసంగించారు. వేలాది మందితో ఒకేసారి రామ నామ జపం పఠించటంతో ఇండియన్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైనట్లు ఆ సంస్థ ప్రతినిధి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తాము రాసిన రామకోటి పుస్తకాలను నిర్వాహకులకు అందజేశారు.