గ్రీన్9 క్లబ్లో ఇంజినీరింగ్ విద్యార్థినులు
గ్రీన్9 క్లబ్లో ఇంజినీరింగ్ విద్యార్థినులు

గ్రీన్9 క్లబ్లో ఇంజినీరింగ్ విద్యార్థినులు
ఒప్పంద పత్రం చూపుతున్న డాక్టర్ మధుకుమార్, డాక్టర్ ఎల్.రమేష్
లండన్ వేదికగా నడుస్తున్న గ్రీన్9 క్లబ్‌ని నగరంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్9 క్లబ్లో ప్రపంచంలోని పలు దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి.
ఇప్పటికే మన దేశంలో చెన్నై కేంద్రంగా 11 కళాశాలల్లో ఈ క్లబ్ నడుస్తుండగా బుల్లయ్య మహిళా కళాశాల సభ్యత్వం పొందడం ఇదే తొలిసారి. ఇందులో 35మంది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థినులు చేరగా సలహాదారునిగా విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.ఆనంద్ వ్యవహరించనున్నారు.
కన్వీనర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ సి.హెచ్ అరుణ్‌కుమార్, సమన్వయ కర్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌లు వ్యవహరిస్తారు. ఈమేరకు సోమవారం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజినీరింగ్ మహిళ కళాశాలలో కళాశాల కరస్పాండెంట్,
కార్యదర్శి డాక్టర్ జి. మధుకుమార్, చెన్నైకి చెందిన గ్రీన్9 క్లబ్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఎల్. రమేష్ (ఎం.జి.ఆర్ వర్సిటీ), తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు సలహాదారు డాక్టర్ బాలమురుగన్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
గ్రీన్ 9 క్లబ్ విద్యార్థులు విద్యుత్తును ఆదా చేయడం, సౌర, మర విద్యుత్తు వినియోగం వంటి వాటిపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
బుల్లయ్య మహిళ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ చౌదరి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.