News

Realestate News

గ్రామాల అభివృద్ధికి యువతే కీలకం

tiruapti real estat news

గ్రామాల అభివృద్ధికి యువతే కీలకం
జిల్లా కలెక్టర్‌ లక్ష్మీనృసింహం
సరుబుజ్జిలి, న్యూస్‌టుడే:

రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరగాలంటే యువత పాత్రే కీలకమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీనృసింహం అన్నారు. సోమవారం విజయరాంపురం గ్రామంలో స్థానిక సర్పంచి గొండు వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన జన్మభూమి-మా వూరు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎదుర్కోగలిన శక్తి ప్రస్తుతం ఒక్క యువతకే ఉందన్నారు. యువత ముందుకొస్తే అన్ని రంగాల్లో సమాజం బాగుపడుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మురుగుదొడ్డిని నిర్మించకుంటే ఆ గ్రామంలో ప్రజలు ఆరోగ్య వంతులుగా జీవించగలుగుతారని తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని కోరారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం రేషన్‌ దుకాణాలకు పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుకలు లబ్ధిదారులకు సక్రమంగా అందేటట్లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బలివాడ శ్రీహరి, తహసీల్దార్‌ పి.రమేశ్‌బాబు, ఎంఈవో ఎన్‌.చంద్రశేఖర్‌, ఎంపీడీవో ఎం.పావని, ఏపీఎం కమలకుమారి పాండ్యన్‌, ఏపీవో ఎ.శ్రీనివాసరావు, వైద్యాధికారి ఎస్‌.వి.ఎస్‌.రాజేశ్‌, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి కూన గణపతిరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.