గ్రంథాలయ అభివృద్ధికి రూ.15 లక్షలు: ఎంపీ
గ్రంథాలయ అభివృద్ధికి రూ.15 లక్షలు: ఎంపీ
మంచి సమాజ నిర్మాణానికి, ప్రజలను మంచి మార్గం వైపు ప్రభావితం చేయగల శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని ఎంపీ ముత్తంశెట్టి
శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శ్రీగౌరీ గ్రంథాలయంలో డీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి బుధవారం ఆయన విచ్చేశారు.
ఎంపీ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా పాత ప్రశ్నపత్రాలను చదవాలన్నారు.
ఒత్తిడిని జయించడం నేటి యువతకు అసలైన సవాలన్నారు.
విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.
గౌరీ గ్రంథాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు.
పోటీతత్వం, శక్తి, కష్టపడేతత్వం, నైపుణ్యాలు విజయపథంలో తీసుకువెళతాయన్నారు.
అనంతరం డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు.
కార్యక్రమంలో శ్రీగౌరీ గ్రంథాలయ అధ్యక్షులు మళ్ల సత్యనారాయణ, కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ,
ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ మళ్ల బాపునాయుడు, జడ్ఆర్యూసీసీ గుత్తా ప్రభాకరచౌదరి,
రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ.రమణమూర్తి, బుద్ధ నాగజగదేశ్వరరావు, మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.