News

Realestate News

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

 


గెలుపే లక్ష్యంగా పని చేయాలి

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌ పిలుపు

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెదేపా

-=కార్యకర్తలు, యువత పని చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

పిలుపునిచ్చారు.

మంగళవారం సాయంత్రం నగరంలోని తెదేపా కార్యాలయంలో జరిగిన నగర,

గ్రామీణ జిల్లాల తెలుగు యువత కార్యకర్తల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని

సూచించారు.

పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్‌ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

జగన్‌కు అధికార దాహం తప్ప,

ప్రజా సేవపై మమకారం లేదన్నారు.

విశాఖ రైల్వేజోన్‌, ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయడంతో కేంద్రం

విఫలమైందన్నారు.

జగన్‌, కేసీఆర్‌లు ఏకమైనా తెదేపాను ఢీకొట్టలేరన్నారు.

కేంద్రంతో పోరాడుతున్న చంద్రబాబుకు ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు.

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ…

గత నాలుగున్నరేళ్ల పాటు పదవులను అనుభవించి ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్తున్న వారు ఇష్టం

వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

తెలుగు యువత నగర అధ్యక్షుడు లొడగల కృష్ణ, తెదేపా నాయకులు ఎం.శ్రీభరత్‌, బండారు

అప్పలనాయుడు, రాము, బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను గజమాలతో సత్కరించారు.