News

Realestate News

గిరి ప్రదక్షిణ ఉత్సవానికి ఏర్పాట్లు

గిరి ప్రదక్షిణ ఉత్సవానికి ఏర్పాట్లు
సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలంలో జులై 8న జరగనున్న గిరి ప్రదక్షిణ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో తొలి పావంచా వద్ద విశాలమైన కూడలి ఏర్పాటు చేయడానికి దేవస్థానం అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సింహగిరి బస్‌స్టాండు ఎదురుగా ఉన్న పాత కాలంనాటి సత్రాలను, కొన్ని దుకాణాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ భవనాలు తొలగించి ఈప్రాంతమంతా విస్తరిస్తే గిరి ప్రదక్షిణ ఉత్సవం రోజు భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈవో కె.రామచంద్రమోహన్‌ అన్నారు. జరుగుతున్న విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు. రూ.60 లక్షలతో తొలి పావంచాను రాతి కట్టడంతో అభివృద్ధి చేస్తామన్నారు.