గిరిజన ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి
గిరిజన ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి
‘న్యూస్టుడే’తో మత్స్యశాఖ సహాయగిరిజన ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి సంచాలకురాలు
గిరిజన ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తికి అన్ని చర్ల్యలు తీసుకున్నట్లు మత్స్యశాఖ నర్సీపట్నం సహాయక సంచాలకురాలు
నిర్మలాకుమారి తెలిపారు. బుధవారం చోడవరం వచ్చిన ఆమె ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
దీనిలో భాగంగా 11 మండలాల్లో చేపల పెంపకం కొత్తగా చేపట్టామని ఆమె వివరించారు.
చెరువుల అంతర్భాగంలో ఫిష్ పాండ్స్ తవ్వామన్నారు. వాటిలో చేపపిల్లలు పెంచుతామని చెప్పారు.
ఇప్పటివరకు నిలకడగా నీరు ఉండి పెద్ద కైవారం ఉన్న జలాశయాల్లో వీటిని పెంచుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
కోనాం, రైవాడ, తాచేరు (ఏన్టీఆర్), తాండవ, తాజంగి, కొమరవోలు, పెద్దేరు జలాశయాలను చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలుగా చేశామన్నారు.
నర్సీపట్నం సబ్ డివిజన్లో 30 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు.
మత్స్యకారులు ఇంతవరకు వాటిని కొనుగోలు చేసేవారని ఆమె తెలిపారు.
ఇపుడు మత్స్యశాఖే వాటిని అందిస్తుందన్నారు.
ఫైబర్ బోటు రూ. 70 వేలు ఉంటుందని చెప్పారు.
మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం అందించే రాయితీ పరికరాలు, వాహనాలు పొందేందుకు డ్వాక్రా సంఘాల సభ్యులై ఉండాలన్నారు.
మత్స్యకారులు పింఛనుకు సంబంధించి 15 మందికి ఇంకా నగదు మంజూరు కావాల్సి ఉందన్నారు.
మత్స్యకారులు కొందరు ప్రైవేటు వ్యాపారులతో లాలూచీ పడి పనిచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
నిషేధించిన క్యాట్ ఫిష్లను పెంచడం, ఆహారంగా పౌల్ట్రీ వ్యర్థాలను వేయడం చట్ట వ్యతిరేకమన్నారు.
ఇలా చేస్తే చెరువులను ధ్వంసం చేస్తామని ఆమె ప్రకటించారు. నిషేధించిన చేపల పెంపకం చేపట్టవద్దని నిర్మలాకుమారి సూచించారు.