గాజువాకకు పాలిటెక్నిక్ కళాశాల

గాజువాక, న్యూస్‌టుడే:
గాజువాకకు పాలిటెక్నిక్ కళాశాల
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎట్టకేలకు గాజువాకకు మంజూరైంది.
దీనిలో భాగంగా మంగళవారం డిపార్టుమెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శంకర్,
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సూపరింటిండెంట్ ఇంజినీర్లు భాస్కర్, శ్రీనివాస్‌లు అనువైన వసతుల కోసం పలుచోట్ల
పరిశీలన జరిపారు.
తొలుత గాజువాక శ్రీనగర్ సమీపంలోని దిబ్బపాలెంలో నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొలి విడతగా కెమిస్రీ,్ట మెటలర్జికల్, మెకానికల్ ట్రేడ్లను నడపాలని యోచిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
మరో రెండు ల్యాబొరేటరీలకు అనువైన వసతులు కావాలన్నారు. అనంతరం అగనంపూడిలోని జూనియర్ కళాశాల
భవనాన్ని పరిశీలించి తాత్కాలికంగా ఇక్కడ పాలిటెక్నిక్ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
త్వరలో గాజువాక పరిసర ప్రాంతాల్లో స్థలం పరిశీలించి శాశ్వత భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు.