ఖేలో ఇండియాలో సత్తా
ఖేలో ఇండియాలో సత్తా
వాలీబాల్ పోటీల్లో ప్రథమస్థానం
విజయనగరం క్రీడలు, న్యూస్టుడే( Khelo Capabilities in India): కడప జిల్లా రాజంపేటలో జరిగిన రెండు రోజుల రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా అండర్-17 వాలీబాల్ పోటీల్లో విజయనగరం బాలుర జట్టు ప్రథమస్థానం కైవసం చేసుకుంది. తుది పోరులో గుంటూరు జట్టుపై విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఈ జట్టుకు శిక్షకులుగా, ప్రబంధకులుగా వ్యవహరించిన వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నారి, ఎస్.నాగన్న, జి.లక్ష్మీనారాయణ, పి.రఘులను జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణంరాజు, భగవాన్దాసు, క్రీడాభివృద్ధి అధికారి ఎన్.సూర్యారావు అభినందించారు.