News

Realestate News

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్లు

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్లు
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గాలియన్‌ వెల్లడి
కొయ్యూరు, న్యూస్‌టుడే: జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, పరవాడలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి జూన్‌ గాలియట్‌ తెలిపారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్‌, షటిల్‌, టేబుల్‌ టెన్నిస్‌, జిమ్నాస్టిక్స్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ తదితర క్రీడల నిర్వహణకు వీలుగా ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నర్సీపట్నం, పరవాడ, చోడవరంలో స్థలాల పరిశీలన పూర్తయిందన్నారు. ఏజెన్సీలోని కొయ్యూరులో క్రీడావికాస్‌ కేంద్రం స్టేడియం నిర్మాణానికి ముందుకు రాగా.. స్థానిక తహసీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న 8.19 ఎకరాల భూమిని జిల్లా క్రీడాధికారులు ఆదివారం పరిశీలించారు.