News

Realestate News

క్రీడా ప్రాంగణానికి ప్రపంచస్థాయి డిజైన్‌

క్రీడా ప్రాంగణానికి ప్రపంచస్థాయి డిజైన్‌
వుడా వీసీ బాబూరావు నాయుడు
ఎం.వి.పి. కాలనీ, న్యూస్‌టుడే: ఆకర్షణీయ విశాఖలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేసిన ప్రాధాన్యతాంశాల్లో ఒకటైన బహుళ క్రీడా ప్రాంగణం (మల్టీ స్పోర్ట్సు కాంప్లెక్సు) అభివృద్ధికి అత్యున్నత ప్రమాణాలు, అత్యుత్తుమ సౌకర్యాలతో కూడిన డిజైన్లు రూపొందించాలని వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ టి.బాబూరావునాయుడు సూచించారు. డిజైన్ల తయారీకి ఆసక్తి కనబరుస్తున్న ఆర్కిటెక్ట్‌లతో బుధవారం వుడా కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు గండిగుండం వద్ద 79 ఎకరాల భూమిని కేటాయించారని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. రానున్న జాతీయ క్రీడలను విశాఖలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు. పోటీల నిర్వహణకు వీలుగా 2018లోగా క్రీడా ప్రాంగణం నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. సుమారు 32 క్రీడాంశాల శిక్షణ, పోటీల నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. క్రీడా ప్రాంగణం లోపల, బయట కనువిందు చేసే పచ్చదనం, మల్టీ లెవల్‌ పార్కింగ్‌, క్రీడాకారులకు మెరుగైన వసతి సదుపాయం, శిక్షణ వసతి, ఇతర అవసరాలను డిజైన్లు తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే నెల 14లోగా డిజైన్లు సిద్ధం చేసి అందజేయాలని, ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి పరిశీలన, ఆమోదం కోసం ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు. ఆయన ఎంపిక చేసే డిజైన్‌ ప్రకారం నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.వి.జి.ఆర్‌.నాయుడు (గణబాబు) మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాటికన్నా విశాఖ క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలం చాలా ఎక్కువని, భవిష్యత్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు జోడించేందుకు వీలుగా కొంత స్థలాన్ని రిజర్వ్‌ చేసి ఉంచాలని సూచించారు. వుడా కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌, వుడా చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ రామతీర్థ, సహాయ ప్రణాళికాధికారి డాక్టర్‌ కె.డి.బ్రైనార్డ్‌, జిల్లా క్రీడల అధికారి సూర్యారావు, జీవీఎంసీ స్పోర్ట్సు డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పది మంది ఆర్కిటెక్ట్‌లు పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఆర్కిటెక్ట్‌లు గండిగుండం వద్ద కేటాయించిన స్థలాన్ని సందర్శించారు.

Source : http://www.eenadu.net/


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo