News

Realestate News

క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించొచ్చు


క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించొచ్చు

 

క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించొచ్చని జేఎన్‌టీయూ కాకినాడ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌ అన్నారు.

శుక్రవారం శొంఠ్యాం సమీపంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జేఎన్‌టీయూ కాకినాడ జోనల్‌ స్థాయి

క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభయ్యాయి.

కళాశాల ఛైర్మన్‌ నడంపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా విద్యా

ప్రణాళిక రూపొందించాలన్నారు.

కళాశాల ప్రధానాచార్యుడు డాక్టర్‌ వై.వంశీధర్‌ మాట్లాడుతూ పోటీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జేఎన్‌టీయూ అంతర్‌

కళాశాలలకు చెందిన 1650 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు.

విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తర్వాత వివిధ జట్లు పోటీ పడ్డాయి.

కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ సాయివర్మ, అధ్యాపకులు గురునాథ్‌, ఢిలేశ్వరరావు, రాజశేఖరం, వై.బాబ్జి,

పి.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.