News

Realestate News

క్రీడలతో ఉజ్వల భవిత

క్రీడలతో ఉజ్వల భవిత
ఇన్‌ఛార్జి ఎస్పీ అప్పలనాయుడు
విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని ఇన్‌ఛార్జి ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు తెలిపారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణంలో నిర్వహించిన క్రీడాదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొనడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రతిఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. అపజయాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు వి.శ్రీనివాసులు, ఉప ప్రధానాచార్యులు స్వామినాయుడు, సరస్వతి, వివిధ విభాగాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo