క్రమశిక్షణతో చదువుకోవాలి

క్రమశిక్షణతో చదువుకోవాలి
మండలంలోని ఎ.కోడూరు సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి రామారావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న ఆయన విద్యార్థుల కోసం తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నది, లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన చదువు చదవాలని, లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వసతిగృహ పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ సహాయాధికారి రాంబాబు, సంక్షేమాధికారులు గోవిందు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.