News

Realestate News

కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయండి


కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయండి

మంత్రికి వాణిజ్యపన్నుల అధికారుల వినతి

విశాఖపట్నం, న్యూస్‌టుడే :కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయండి.

రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు వాణిజ్య పన్నుల శాఖాధికారుల సంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు.

నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో ఆయనను కలసిన సభ్యులు విశాఖ డివిజన్‌లో పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కొత్త డివిజన్‌ కావాలని కోరారు.

ఎ.సి.టి.ఒ. క్యాడరుకు గజిటెడ్‌ హోదా ఇవ్వాలని, చెక్‌పోస్టుల అధికారులు, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన సర్దుబాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.

మంత్రిని కలసిన వారిలో వాణిజ్య పన్నుల విభాగం సంయుక్త కమిషనర్‌ కె.నాగేంద్ర, సి.టి.ఎన్‌.జి.ఒ.ల సంఘం ప్రధాన కార్యదర్శి అల్లెన రమేష్‌ కుమార్‌, విశాఖ డివిజన్‌ అధ్యక్షులు

పి.సూర్యప్రకాశరావు, సభ్యులు అప్పలరాజు, కామేశ్వరరావు, నమ్మి శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo