News

Realestate News

కొత్త జలం…ఆశలకు బలం

కొత్త జలం…ఆశలకు బలం
నాగావళి నదికి కొత్తనీరొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, నైరుతి రుతుపవనాలు ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలోకి వరద నీరు చేరుతోంది. నీటి ఉద్ధృతికి నారాయణపురం ఆనకట్టపై రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు రోజులు క్రితం వరకూ నదిలో కాస్తంతైనా ప్రవాహం లేదు. వాతావరణం అనుకూలించడంతో జల కళ వచ్చింది. సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

– సంతకవిటి, న్యూస్‌టుడే