News

Realestate News

కొత్త కోర్సు వచ్చిందోచ్‌…

కొత్త కోర్సు వచ్చిందోచ్‌…
ఏయూలో ఇంటర్నేషనల్‌ ఎంబీఏ కోర్సు
మొదటి ఏడాది 60 మందికి ప్రవేశం
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓ అంతర్జాతీయ స్థాయి కోర్సుకు ఈ విద్యా సంవత్సరం నుంచి అంకురార్పణ చేయబోతోంది. ఇప్పటికే ఈ కోర్సు నిర్వహణకు  నిధులు మంజూరయ్యాయి. ఆసియాలోనే ఎంబీయే డిగ్రీ మొదటగా ప్రవేశపెట్టిన ఘనత ఉన్న ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు అదే సబ్జెక్టులో అంతర్జాతీయ కోర్సుకు సిద్ధమవుతోంది.

విశాఖపట్నం, న్యూస్‌టుడే
అంతర్జాతీయస్థాయి ఎంబీయే విద్య 2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంకానుంది. దీనికోసం రూ. 15 కోట్లు రూసా నిధులు మంజూరయ్యాయని వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు. ఏయూ అవుట్గేట్ వద్ద ఉన్న ఎనెక్స్‌ భవనంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఏటా 60 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఇందులో 10 శాతం విదేశీ విద్యార్థులు ఉంటారు. క్యాట్, జీ మ్యాట్ ర్యాంకుల ద్వారా మాత్రమే విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయి. కోర్సు ఫీజు ఏడాదికి సుమారు రూ.4 లక్షలు. ట్రైమిస్టర్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ స్థాయి బోధకుల ఆధ్వర్యంలో విద్యాబోధన కొనసాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలోనే తరగతి గదులు, క్యాంపస్‌, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దేశంలోనే ఇటువంటి కోర్సు ప్రారంభించనున్న మొట్టమొదటి  విశ్వవిద్యాలయం ఏయూనే కావడం గర్వకారణం.

ఆసియాలో మొదటిది…
ఎంబీఎ (మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సును 1957లో మన దేశంలోనే కాక ఆసియాలోనే మొదటిసారి ప్రారంభించిన ఘనత కూడా ఏయూకే ఉంది. ఈ కోర్సు ఏయూలో ప్రారంభించడానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అప్పట్లో స్వయంగా కృషిచేశారు. అప్పటి ఉప కులపతిగా ఉన్న ఆచార్య వీఎస్‌ కృష్ణ అమెరికా పర్యటన జరిపారు. ఆ సమయంలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్లో తొలి పీహెచ్‌డీ చేసిన ఆచార్యులు కె.కె.దాస్‌ ద్వారా ఏయూలో ఎంబీఏ ఏర్పాటుకు కార్యాచరణ చేశారు. 1957లో ఎంబీఏ కోర్సు ప్రారంభమైంది. ఈ ఏడాది ఏయూ ఎంబీఏ విభాగం నుంచి డైమండ్‌ జూబ్లీ (60)వ బ్యాచ్‌ బయటకు రానుంది. 1977-78లో పార్టు టైమ్ ఎంబీఏ, 2006లో రిటైల్‌ ఎంబీఏ కోర్సులు ప్రారంభించిన చారిత్రక నేపథ్యం ఏయూ సొంతం. ఈ తరుణంలోనే దేశీయంగా మేనేజ్‌మెంట్ విద్యనందించే సంస్థలను అధిగమించేలా ఇంటర్నేషనల్‌ ఎంబీఏను ప్రారంభించనున్నారు. పూర్తి సెల్‌్్ఫఫైనాన్స్‌ విధానంలో రెండేళ్లకు సుమారు రూ.8 లక్షల కోర్సు ఫీజుగా నిర్ధరించారు.

ప్రత్యేక కమిటీ…
ఇంటర్నేషనల్‌ ఎంబీఏ కోర్సు ప్రారంభించేందుకు ఈ ఏడాది జనవరి నుంచే కసరత్తు ప్రారంభించారు. మేనేజ్‌మెంట్ విద్యలో నిపుణలైన ఆచార్యులు ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు ఛైర్మన్‌గా రూసా కేంద్ర సమన్వయకర్త ఆచార్య వెంకటేశ్వరరావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్యామ్‌ప్రసాద్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఆచార్య రామ్‌నారాయణ, ఐఐఎం విశాఖ సంచాలకులు ఆచార్య చంద్రశేఖర్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య రామమోహనరావు, కామర్స్‌ విభాగాధిపతి ఆచార్య సత్యనారాయణ మరో నలుగురు ఆచార్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

తుది దశలో..
కమిటీ జనవరి, మార్చి నెలల్లో సమావేశమై కోర్సుకు సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించింది. అనుమతుల మంజూరు తదితరాలు తుది దశలో ఉన్నాయి. ఏయూ అకడమిక్‌ సెనెట్, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పూర్తి కావాల్సి ఉంది. ఒకటే బ్యాచ్‌ అయినందున ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తాం. తాత్కాలికంగా ఒక స్మార్ట్‌ తరగతి గదిని తయారు చేస్తాం. తదుపరి మిగిలిన ఆకర్షణీయ పనులు చేయిస్తామని వీసీ ఆచార్య నాగేశ్వరరావు పేర్కొన్నారు.

కరిక్యులం ఇదీ
అంతర్జాతీయ ఎంబీఏ కోర్సును ప్రారంభించేందుకు నియామకమైన కమిటీ ప్రపంచంలోని దాదాపు 60 ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ఎంబీఏ కోర్సును అధ్యయనం చేసినట్లుగా సమాచారం. ఆధునికమైన ట్రెండ్స్‌ ఉంటాయి. డైనమిక్‌ తరహాలో ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్‌ మార్పు చేయడం, పారిశ్రామిక వేత్తలను కోర్సులోను, ప్లేస్‌మెంట్్సలో భాగస్వాములను చేస్తారు. కంపెనీలు సైతం కార్యనిర్వాహక కమిటీలో ఉంటాయి. ఫ్యాకల్టీని కూడా అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో నియమిస్తారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo