కొత్తవారికే వుడా ప్లాట్లు

వేలంలో వుడా కఠిన నిబంధన
173 స్థలాలకు దరఖాస్తుల ఆహ్వానం
వుడా సొంతంగా, వివిధ ప్రయివేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలతో కలిసి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రాజకీయ అండ, పలుకుబడి, ధనవంతులే తమతమ కుటుంబ సభ్యుల పేర్లతో రెండు నుంచి మూడేసి స్థలాలను వేలంలో దక్కించుకుంటున్నారు. దీనివల్ల ఇప్పటికీ ఇంటి స్థలానికి నోచుకోని మధ్య తరగతి కుటుంబాలకు చుక్కెదురవుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఇప్పటికే వుడా నుంచి వివిధ రూపాల్లో ప్లాట్లు పొందిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేసే వీల్లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనివల్ల కొత్త వాళ్లకు అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.
ఆసక్తి కలిగిన వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా వుడా అధికారులు ఏర్పాట్లు చేశారు. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.వియుడిఎ.జివొవి.ఇన్. – వెబ్సైట్లో వేలం నిర్వహించే ఖాళీ స్థలాల వివరాలను లేఅవుట్లతో సహా అందుబాటులో ఉంచారు. జూన్ 20లోగా ఆన్లైన్లో ప్రజలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పునః పరిశీలించాక జూన్ 27 నుంచి 30 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్నాతకోత్సవ మందిరంలో వేలం నిర్వహిస్తామని వుడా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
నార్వేలో అధ్యయనం కోసం ఎమ్మెల్యే వాసుపల్లి
విశాఖపట్నం, ఈనాడు: సముద్రంలో వలలు కట్టి చేపల పెంపకం (సీకేజ్ కల్చర్)లో అద్భుత ఫలితాలు సాధిస్తున్న యూరప్లోగల నార్వేలో అధ్యయనం కోసం దేశం నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున వెళుతున్న బృందంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు చోటు లభించింది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకల్ల నారాయణ ఛైర్మన్‌గా పది మంది సభ్యుల బృందం ఈనెల 18 నుంచి వారం రోజులపాటు నార్వేలో పర్యటించనున్నది. దేశంలోని తీర ప్రాంతాల్లో సీకేజ్ కల్చర్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల చేపల ఎగుమతులతో భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని పొందడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..
సైబర్వాలీ, మధురవాడ, కూర్మన్నపాలెం, విజయనగరంలోని కనపాక అయ్యన్నపేట, వుడా-ప్రయివేట్ భాగస్వామ్య కాపులుప్పాడలోని చిలుకూరిలేఅవుట్, కూర్మన్నపాలెం-6, కూర్మన్నపాలెం సెంట్రల్ లేఅవుట్, శొంఠ్యాం, నరవ లేఅవుట్లలో 25 ఖాళీ స్థలాలు.. పరదేశీపాలెం లేఅవుట్లో 18 ఖాళీ స్థలాలు.. వుడా, ప్రయివేట్ భాగస్వామ్య దాకమర్రి లేఅవుట్లో 130 ఖాళీ స్థలాలతో కలిపి మొత్తం 173 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నారు.