News

Realestate News

కేజీహెచ్‌ ఐపీసీయూ విభాగం ప్రారంభం

కేజీహెచ్‌ ఐపీసీయూ విభాగం ప్రారంభం
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కింగ్‌జార్జి ఆసుపత్రిలోని పిల్లల వార్డులో పది పడకలతో ఇంటెన్సివ్‌ పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌(ఐపీసీయూ) ఏర్పాటైంది. దీనిలో అయిదు వెంటిలేటర్లను ఏర్పాటుచేశారు. అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలకు సిద్ధమైన ఐపీసీయూను సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఆయా పరికరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి విభాగం పెద్దాసుపత్రికి చాలా అవసరమన్నారు. కేజీహెచ్‌లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నందున అప్పుడే పుట్టిన పిల్లలకు ఇక్కడ వైద్య సేవలను అందించవచ్చన్నారు. కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున మాట్లాడుతూ రూ. 10 లక్షల ఖర్చుతో పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పిల్లల విభాగాధిపతి డాక్టర్‌ పి.వేణుగోపాల్‌, ప్రొఫెసర్లు పద్మావతి, భాగ్యలక్ష్మి, వైద్యాధికారులు శాస్త్రి, బంగారయ్య, సాధన పాల్గొన్నారు.

ఒకే పడకపై ఇద్దరేసి చిన్నారులు
కేజీహెచ్‌ పిల్లల వార్డులో రోగుల తాకిడి అధికంగా ఉంది. 30 పడకలు ఉంటే 70 మంది వరకూ చిన్నారులు ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీసీయూ వార్డు ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకే పడకపై ఇద్దరేసి చిన్నారులను ఉంచి వైద్యం అందించారు. ఇదేమిటని కలెక్టర్‌ ప్రశ్నించగా పడకలు చాలకపోవడం వల్ల ఒక పడకను ఇద్దరు చిన్నారులకు కేటాయించాల్సి వచ్చిందని వైధ్యాధికారులు తెలిపారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo