News

Realestate News

కేజీహెచ్‌లో అదనపు డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

vizagrealestate news

ముందుకు వచ్చిన రోటరీ సంస్థ
 

వన్‌టౌన్‌ :

                 కింగ్‌జార్జి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు డయాలసిస్‌ సేవలందించేందుకు రోటరీ సంస్థ ముందుకు వచ్చింది. ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’ వర్తించని కేసులకు డయాలసిస్‌ సేవలందించేందుకు ఆసుపత్రిలో ప్రస్తుతం నాలుగు యంత్రాలున్నాయి. వీటికి అదనంగా మరో పది యూనిట్లను ఇచ్చేందుకు రోటరీ సంస్థ సమ్మతించిందని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. ఎన్టీర్‌ వైద్యసేవ కింద పీపీపీ పద్ధతిలో ప్రస్తుతం డయాలసిస్‌ సేవలందిస్తున్నారు. ఆ పథకం పరిధిలోకి రాని రోగులకు ప్రస్తుతం ఉన్న యంత్రాలు సరిపోవడం లేదు. రోటరీ సంస్థ అందించే పరికరాలతో మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుపడుతుందని డాక్టర్‌ అర్జున వివరించారు. కేజీహెచ్‌ స్పెషాలిటీ బ్లాకులో అదనంగా రెండు అంతస్తుల భవనం పనులు ఇటీవలే పూర్తయ్యాయని, వాటిలో డయాలసిస్‌ యంత్రాలు పెట్టేందుకు ఎంతెంత స్థలం కేటాయించాలనే అంశాన్ని శుక్రవారం పరిశీలించామన్నారు. త్వరలోనే రోటరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ కె.సత్యవరప్రసాద్‌, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్లు జి.బుచ్చిరాజు, జి.ప్రసాద్‌, కె.ఎ.వి.సుబ్రమణ్యం, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ బి.బంగారయ్య, డాక్టర్‌ విజయశంకర్‌, డీఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo