News

Realestate News

కేంద్ర సాయం లేకపోయినా రాష్ట్రాభివృద్ధి: మంత్రి గంటా


కేంద్ర సాయం లేకపోయినా రాష్ట్రాభివృద్ధి: మంత్రి గంటా

కేంద్ర సాయం లేకపోయినా రాష్ట్రాభివృద్ధి: మంత్రి గంటా

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా సమర్థ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టే రాష్ట్రాన్ని

అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఆరో విడత జన్మభూమి-మావూరు కార్యక్రమం విశాఖ నగర పరిధి పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో బుధవారం

జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా మద్దతు తెలిపి అండగా నిలవాలన్నారు.

రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చినా పార్టీలకతీతంగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎవరూ అధైర్యపడాల్సిన

పనిలేదన్నారు.

రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 111 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నట్లు

వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo