కిక్ బాక్సింగ్ ఓవరాల్ ఛాంపియన్ ఏయూ
కిక్ బాక్సింగ్ ఓవరాల్ ఛాంపియన్ ఏయూ

కిక్ బాక్సింగ్ ఓవరాల్ ఛాంపియన్ ఏయూ
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆలిండియా కిక్ బాక్సింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
సోమవారం వరకు జరగాల్సిన పోటీలు ముందస్తుగానే ముగిశాయి. పురుషుల విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 43 పాయింట్లు సాధించి కైవసం చేసుకుంది.
ద్వితీయ స్థానంలో లౌలీ ప్రొఫెషనల్ యూనివర్సీటీ 25 పాయింట్లు సాధించింది. మహిళల విభాగంలో ఆల్‌రౌండ్ ఛాంపియన్స్‌గా ఎం.డి.యూ రోహితక్ 33 పాయింట్లు సాధించింది.
ఇందులో ఆంధ్రవిశ్వవిద్యాలయం 30 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. చంఢీఘఢ్ యూనివర్సిటీ 27 పాయింట్లతో తృతీయ స్థానంతో సరిపుచ్చుకుంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.
ముగింపు కార్యక్రమంలో వీసీ సతీమణి విజయకుమారి, రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.రామమోహనరావు, ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్
ఎన్.విజయమోహన్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎ.పల్లవి, అధికారులు ఆనందబాల, చిన్నారావు, డాక్టర్ జి.ఎస్.వర్మ, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ శివప్రసాద్, సారధి తదితరులు పాల్గొన్నారు.