News

Realestate News

కామన్వెల్త్‌ చెస్‌ పోటీల్లో సాహితికి బంగారు పతకం

కామన్వెల్త్‌ చెస్‌ పోటీల్లో సాహితికి బంగారు పతకం
గాజువాక, న్యూస్‌టుడే: ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో న్యూదిల్లీలో ఈ నెల 2 నుంచి 11 వరకు నిర్వహించిన కామన్వెల్త్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో అండర్‌-10 విభాగంలో గాజువాకకు చెందిన సాహితీవర్షిణి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఏడు దేశాల నుంచి 48 మంది బాలలు పాల్గొనగా…సాహితి ఏడు రౌండ్లలో 6 పాయింట్లతో ముందు నిలిచింది. ఫెడరేషన్‌ కార్యదర్శి భరత్‌చౌహాన్‌ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నట్లు బాలిక తండ్రి, కోచ్‌ లోకేశ్వరరావు తెలిపారు. సాహితి వచ్చే ఆగస్టు 21 నుంచి బ్రెజిల్‌లో జరగనున్న ప్రపంచ బాలికల చెస్‌ టోర్నీలో పాల్గొంటుందని ఆయన తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo