News

Realestate News

కాగితం బొమ్మలు… కళకు ప్రతిరూపాలు

Waste news paper used to make images in vizag image

సృజనాత్మక ఆలోచనలకు పదునుపెడుతున్న కళాకారులు
న్యూస్‌టుడే, సింధియా, ఎన్‌ఏడీకూడలి

సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి. కళాత్మక దృష్టి, సృజనాత్మక ఆలోచనలు ఉండాలే గాని చిత్తు కాగితంతోనైనా విభిన్న కళారూపాలను తయారు చేయవచ్చునని నిరూపిస్తున్నారీ కళాకారులు. మన కళ్ల ఎదుట కదలాడే ప్రతి వస్తువు కళాకృతుల తయారీకి ముడిసరుకేనని మరోసారి నిరూపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మజ్జి దేవీభవాని చదివింది పదో తరగతే అయినా ఇంటి వద్ద ఖాళీగా కూర్చోకుండా తన కళాభిరుచికి మరింత పదును పెడుతూ… దినపత్రికలతో వివిధ ఆకృతులు తయారీ చేస్తోంది. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి కరాసాకు చెందిన ఓబులరెడ్డి డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రంగుల పెన్సిళ్లు వినియోగించకుండానే… వివిధ రంగుల కాగితాలతో ఆకర్షణీయ ఆకృతులు తయారు చేస్తూ.. అందరినీ అబ్బుర పరుస్తున్నారు.

రోజూ చదివి పక్కన పెట్టేసే దినపత్రికలే భవానీ తయారు చేసే ఆకృతులకు వనరులు. కాగితాలను సన్నగా కత్తిరించి వాటిని చిన్నపరిమాణంలో ఉండే గొట్టం రూపంలో మడతపెడుతోంది. అలా ముందే అనుకున్న ఆకృతికి అవసరమైనన్ని గుండ్రని, సన్నని గొట్టాలను కావాల్సిన ఆకృతిలో చుట్టుకుంటుంది. అలా చుట్టిన వాటిని జిగురుతో అంటించేస్తోంది. ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ… కావాల్సిన రూపం వచ్చిన తర్వాత రంగులు పూస్తుంది. మధ్య మధ్యలో అదనపు ఆకర్షణలు జోడించడంతో కళారూపానికి మరింత సొగసు చేకూరుతుంది. ఒక్కో కళారూపం తయారీకి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. సహనం, ఓపిక ఉంటేనే ఇలాంటి ఆకృతులు తయారు చేయగమని చెబుతోంది భవానీ.

ఆకట్టుకునే ఆకృతులు
కేవలం దిన పత్రికలనే వినియోగిస్తూ ఇంటిలో గోడలకు తగిలించే వినాయకుడి బొమ్మలు, పూలగుత్తెలు, కాగితపు పూలు… తదితర ఆకారాలతో అందమైన ఆకృతులను తయారు చేస్తోంది. ఆలయానికి పూజా సామగ్రిని తీసుకెళ్లె పూలబుట్ట, ఆభరణాలు భద్రపరిచే భరిణిలు, చిన్నపరిమాణంలో ఉండే దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సింహాసనం పీటలను తయారు చేస్తుంది.

బియ్యం గింజలు…కోడిగుడ్డు గుల్లలు
బియ్యం గింజలు, బయట పారేసే కోడిగుడ్డు పెచ్చులను ఉపయోగించి వివిధ రకాల ఫ్లవర్‌వాజ్‌లను సిద్ధం చేస్తోంది. వాటిల్లో అలంకరించే పువ్వులను కూడా కాగితాలతోనే తయారు చేయడం విశేషం. అలా తయారు చేసిన ఆకృతులను వాళ్లింటికొచ్చే అతిథులకు బహుమతిగా ఇవ్వడం భవానీ అభిరుచి.

ఆలోచనలో నుంచే కళ పుడుతుంది
నాకు చిన్నతనం నుంచి వివిధ ఆకృతులు తయారు చేయడం ఇష్టం. మొదట్లో గోరింటాకు(కోన్‌)తో రకరకాల డిజైన్లు వేయడం నేర్చుకున్నా. తర్వాత వృథాగా పడేసే దినపత్రికలతో బొమ్మలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి కళారూపాలు చేయడం మొదలెట్టా. మా నాన్న ధర్మారావు షిప్‌యార్డులో ఎల్సీరీస్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తల్లి వరలక్ష్మి. వారి ప్రోత్సాహంతోనే వివిధ రూపాలు తయారు చేస్తున్నా. సృజనాత్మక ఆలోచనలోంచే కళ పుడుతుందని నా నమ్మకం.

– మజ్జి దేవీభవానీ, షిప్‌యార్డుకాలనీ

Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo