కళను బతికించడంలో ఎనలేని కృషి
కళను బతికించడంలో ఎనలేని కృషి
ప్రజా కళలను ముందుకు తీసుకువెళ్లడంలో సీఐటీయూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి,
దివంగత రమేష్ ఎనలేని కృషి చేశారని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి సింధు పేర్కొన్నారు.
పట్టణంలోని రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఆదివారం రమేష్ ప్రథమ వర్థంతి నిర్వహించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సింధు మాట్లాడుతూ నేడు కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా కళల ద్వారానే పోరాటాలు చేస్తున్నామన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు మాట్లాడుతూ కళాకారుడు,
ఉద్యమకారుడిగా ప్రజల్లో ఎప్పుడూ రమేష్ నిలిచి ఉంటారన్నారు.
అనంతరం నిర్వహించిన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి.
అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి,
నగర ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మళ్ల సత్యనారాయణ,
మూర్తి, గనిశెట్టి సత్యనారాయణ, రాము, ఎస్.అరుణ, లోకనాథం, అరుణ, కళాకారులు పాల్గొన్నారు.