News

Realestate News

కల్యాణోత్సవాలు చూతము రారండి…

కల్యాణోత్సవాలు చూతము రారండి…
నేటి నుంచి ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవాలు
బుధవారం స్వామివారి కల్యాణం
వారం రోజులపాటు ప్రత్యేక వేడుకలు
ఉపమాక(నక్కపల్లి), న్యూస్‌టుడే: కలియుగ దైవం.. కొలిచినవారికి కొంగుబంగారం..ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న ఉపమాకలోని వెంకన్న ఆలయం వార్షిక కల్యాణ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లును తితిదే చేట్టింది. వేడుకలను తిలకించడానికి లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. ఇక్కడ నిత్యం విశేషపూజలు, కార్యక్రమాలుంటాయి. ఈ వేడుకలు 7వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తితిదే ఆధ్వర్యంలోని సేవా బృందాలతో కోలాటం, భజనలు, నృత్యాలు ఉంటాయి.

వేడుకలు జరిగే తీరిది..
7.3.17: మధ్యాహ్నం 2గంటలకు పెళ్లి కావడి ఉత్సవం. సాయంత్రం 6:30 నుంచి 8గంటల వరకు పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, అంతరాలయ పూజ. అనంతరం మృత్సంగ్రహణం(పుట్టమన్ను సేకరణ), సుదర్శన పెరుమాళ్‌ తిరువీధి సేవ. 9:45 నుంచి శ్రీదేవి, భూదేవీ సమేత వెంకన్నకు అశ్వవాహనంపై తిరువీధి ఉత్సవం. 11:10 నుంచి 12:00 వరకు నిత్యసేవాకాలం, తీర్థగోష్ఠి. అర్ధరాత్రి దాటిన తర్వాత అంకురార్పణ, విశేషహోమాలు.
8.3.17: తెల్లవారు 2 గంటల నుంచి 3:30 గంటల వరకు కొండపై ఉన్న మూలవిరాట్‌కు అభిషేకం, బాల భోగం, తర్వాత భక్తులకు దర్శనాలు. ఉదయం 10:50 నుంచి 11:40 శుద్ధి, అనంతరం ప్రత్యేకహోమాలు, ఆలయంలో అష్టదిక్పాలకు ఆహ్వానం. మధ్యాహ్నం 12:20 నుంచి 1:30 వరకు పెద్దపల్లకీలో ఉత్సవమూర్తులకు తిరువీధి వేడుక. 1:45 వరకు ధ్వజారోహణం ప్రారంభం. సాయంత్రం 4:45నుంచి 6:30వరకు నిత్యారాధన, ప్రత్యేక హోమాలు, చక్రపెరుమాళ్‌ తిరువీధుల్లో వూరేగింపు, గ్రామ బలిహరణ. రాత్రి 8:30 నుంచి 11:00గంటల వరకు పెళ్లి మాటలు(కన్యావరుణ సంవాదం), 11:10 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు రథోత్సవం.
12:45 నుంచి స్వామివారి కల్యాణం మహోత్సవం.
9.3.17: తెల్లవారు 3:45 నుంచి ఉదయం 5 గంటల వరకు శుద్ధి, నిత్యార్చన. ఉదయం 10:50 నుంచి 11:45 వరకు బాలభోగనివేదన, విశేష హోమాలు, సుదర్శన పెరుమాళ్‌ తిరువీధి సేవ, గ్రామ బలిహరణ. మధ్యాహ్నం 12:00నుంచి 12:30 రాజభోగ నివేదన, తీర్థగోష్టి. సాయంత్రం 5:10 నుంచి 6:10 సాయంకాల అర్చన, అనంతరం విశేషహోమాలు, బలిహరణ, సుదర్శన పెరుమాళ్‌ తిరువీధి సేవ. రాత్రి 8:30 నుంచి 9:45 వరకు హంస వాహనంపై సతీసమేతుడైన వెంకన్నకు తిరువీధిసేవ. తర్వాత నిత్యాసేవాకాలం, తీర్థగోష్ఠి.
10.3.17: తెల్లవారు 4 గంటల నుంచి 5 గంటల వరకు నిత్యార్చన, బాలభోగ నివేదన. ఉదయం 11:00నుంచి బలిహరణ, సుదర్శన చక్రపెరుమాళ్‌కి తిరువీధి వేడుక, రాజభోగ నివేదన. సాయంత్రం 5 గంటల నుంచి 5:45వరకు సాయంకాలార్చన. సాయంత్రం 6నుంచి బలిహరణ, సుదర్శన చక్రపెరుమాళ్‌కి తిరువీధి సేవ. రాత్రి 8:30 నుంచి సదస్యం, పండిత సభ, అనంతరం పుణ్యకోటి వాహనంపై స్వామి తిరువీధి ఉత్సవం. నిత్యసేవాకాలం, తీర్థగోష్ఠి.
11.3.17: తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల వరకు సుప్రభాతం, అభిషేకం, నిత్యార్చన, బాలభోగ నివేదన, విశేష హోమాలు. ఉదయం 11:00 గంటలకు బలిహరణ, సుదర్శన చక్రపెరుమాళ్‌కి తిరువీధి వేడుక, రాజభోగ నివేదన. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 వరకు తోటోత్సవం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, తీర్థగోష్ఠి. సాయంత్రం 6:45 నుంచి 7:45 వరకు విశేష హోమాలు, బలిహరణ, సుదర్శన చక్రపెరుమాళ్‌కి తిరువీధి సేవ. 8:30 నుంచి 9:45 గజవాహనంపై వెంకన్నకు తిరువీధుల్లో వూరేగింపు, అనంతరం నిత్య సేవా కార్యక్రమాలు.
12.3.17: తెల్లవారుజామున 3:45 నుంచి 4:45 వరకు నిత్యార్చన, విశేష హోమాలు, బాలభోగ నివేదన. ఉదయం 11:00 నుంచి 11:45 వరకు గ్రామ బలివిసర్జన, సుదర్శన పెరుమాళ్‌ తిరువీధుల్లో వూరేగింపు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:45 పూర్ణాహుతి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం, కంకణ విసర్జన. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 7:30 వరకు సతీసమేతుడైన వెంకన్నకు తిరువీధిసేవ, రాజయ్యపేట తీరంలో చక్రస్నాన మహోత్సవం. రాత్రి 9:45 నుంచి ఉత్సవమూర్తులకు అద్దపు సేవ. 11:00 నుంచి అర్థరాత్రి 12:30 వరకు రథోత్సవం. 12:45 నుంచి తెల్లవారు 2వరకు చోర మండపం వద్ద చోర సంవాదం వేడుక. అనంతరం 3గంటల వరకు స్వామివారి ఆస్థాన మండపంలో లక్ష్మీసంవాదం, నిత్యసేవాకాలం, తీర్థగోష్టి.
13.3.17: తెల్లవారు 3:30 నుంచి 4:45 వరకు తొలిరోజు పవళింపు సేవ, పుష్పయాగోత్సవం, నిత్యార్చన, బాలభోగనివేదన, తీర్థగోష్టి. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు సాయంకాలర్చన, విశేషహోమాలు, ప్రాకారంలో అష్టదిక్పాలకు బలివిసనర్జన, ధ్వజావరోహణం. రాత్రి 7:45 నుంచి 9గంటల వరకు స్వామి ఆస్థాన మండపంలో ద్వాదశ తిరువారాధన, నిత్యసేవాలం, తీర్థగోష్ఠి. రాత్రి 9:15నుంచి 10:30వరకు ఉత్సవమూర్తులకు పల్లకీలో ప్రాకార సేవ. 10:45 నుంచి 11:20 వరకు స్వామివారికి పవళింపుసేవ.
14.3.17: తెల్లవారు 4:30 నుంచి 6గంటల వరకు నిత్యార్చన, బాలభోగనివేదన, తీర్థగోష్ఠి. రాత్రి 8నుంచి 9 గంటల వరకు తీర్థగోష్ఠి, పవళింపుసేవ.
15.3.17: తెల్లవారు 4:30 నుంచి 6గంటల వరకు నిత్యార్చన, బాలభోగనివేదన, తీర్థగోష్ఠి. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తీర్థగోష్ఠి, పవళింపుసేవ.

భద్రత నడుమ చేరిన ఆభరణాలు
ఉపమాక(నక్కపల్లి), న్యూస్‌టుడే: ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల్లో స్వామివారికి అలంకరించే వజ్రాభరణాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం ఆలయానికి తీసుకువచ్చారు. ఎస్సై లొడ్డు రామకృష్ణ, తితిదే ప్రత్యేక కార్య నిర్వహణాధికారి మునిరత్నంరెడ్డి, విజిలెన్స్‌, భద్రతా సహాయాధికారి, ఇతర ఉద్యోగులు విశాఖలోని ఖజానా కార్యాలయం నుంచి ఎ.ఆర్‌. భద్రతా సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహనంలో వీటిని ఉపమాక తీసుకువచ్చారు. ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు నగలు పెట్టెకు పూజలు చేశారు. అనంతరం వీటిని అధికారులు ఆలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఉద్యోగులు పవన్‌, బాలసుందరశర్మ, చంద్రశేఖర్‌, గిరి తదితరులున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo