News

Realestate News

కరోనా కేసులు…బ్రిటన్ను వెనక్కినెట్టి భారత్

కరోనా కేసులు…బ్రిటన్ను వెనక్కినెట్టి భారత్

                                                                                                       

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. వైరస్‌ కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో బ్రిటన్‌ను వెనక్కినెట్టి భారత్‌ నాలుగో స్థానానికి చేరుకున్నది.

గురువారం సాయంత్రం నాటికి దేశంలో కేసుల సంఖ్య 2,93,754కి చేరింది. దీంతో ఇప్పటివరకూ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న బ్రిటన్‌ ( కేసులు 2,91,409) ఐదో స్థానంలోకి దిగజారింది.

కాగా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో అమెరికా (20,76,694), రెండో స్థానంలో బ్రెజిల్‌ (7,87,489), మూడో స్థానంలో రష్యా (5,02,436) ఉన్నాయి.

ఇక వైరస్‌ కారణంగా అధికంగా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్‌ పదకొండో స్థానంలో ఉన్నది. గురువారం నాటికి దేశంలో వైరస్‌ మృతుల సంఖ్య 8,102కు చేరింది.

మరణాల విషయంలో తొలి స్థానంలో అమెరికా (1,15,547), రెండో స్థానంలో బ్రిటన్‌ (41,279), ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ (40,276) ఉన్నాయి.