News

Realestate News

కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి.. కొత్తగా 116 పాజిటివ్‌లు

కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి.. కొత్తగా 116 పాజిటివ్‌లు

    

ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మహారాష్ట్ర మారింది. అత్యధిక కేసులు అక్కడే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలతోపాటు అంతే మొత్తంలో పోలీసులు కూడా కరోనా వైరస్‌ బారినపడుతున్నారు.

రాష్ట్రంలో ఒక్క రోజులోనే 116 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ముగ్గురు మరణించారు. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,211కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు పోలీస్‌ శాఖలో 25 మంది ఈ ప్రాణాంతక వైరస్‌తో మృతిచెందారు.