News

Realestate News

కమిషనరేట్‌లో భవనం పునఃప్రారంభం

కమిషనరేట్‌లో భవనం పునఃప్రారంభం
విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగర పోలీసు కమిషనర్‌ కార్యాయంలో మరమ్మతులకు గురైన 113 ఏళ్ల చరిత్ర కలిగిన భవనాన్ని ఆధునికీకరించి పునం ప్రారంభించడం ఆనందంగా ఉందని నగర పోలీసు కమిషనర్‌ టి.యోగానంద్‌ అన్నారు. ఆదివారం ఉదయం కమిషనరేట్‌ ప్రాంగణంలో గల భవనాన్ని హెచ్‌పీసీఎల్‌ ప్రాంతీయ అధికారి రవిశంకర్‌తో పాటుగా ఆయన చేతుల మీదుగా పున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌ పథకం కింద హెచ్‌పీసీఎల్‌ రూ. 30 లక్షలు, సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిలో కొంత సొమ్మును వెచ్చించి ఆధునికీకరించామని తెలిపారు. పాత కట్టడాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా అదే రూపురేఖలతో మరింత దృఢంగా ఉండేలా ఆధునికీకరించామన్నారు. కార్యక్రమంలో జేసీపీ నాగేంద్రకుమార్‌, డీసీపీ ఫకీరప్ప, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo