కట్టడాల నిర్మాణంలో ఆధునిక పరిజ్ఞానం

కట్టడాల నిర్మాణంలో ఆధునిక పరిజ్ఞానం
ఏయూ ప్రాంగణం(construction of modern technology): కట్టడాల నిర్మాణంలోను, భారీ కట్టడాల నాణ్యత పరిరక్షణలోను ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ రంగంలో ఆరోగ్యకరమైన ఆధునిక పరిజ్ఞానం అన్న అంశంపై ఏర్పాటు చేసిన రెండురోజుల జాతీయ సదస్సును ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో సెన్సార్లను ఉపయోగించి భారీ కట్టడాల్లో చోటు చేసుకున్న స్వల్పమార్పులను సైతం గుర్తించవచ్చన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య పి.ఎస్.అవధాని, ఐజిసిఎఆర్ కల్పకం ఎన్డిఎ విభాగాధిపతి డాక్టర్ బి.పూర్ణచంద్రరావు, విభాగాధిపతి ఆచార్య పి.ప్రమీలదేవి, ఆచార్య పి.శ్రీనివాసరావు, ఆచార్య కె.రాంజీ, ఆచార్య టి.సుబ్రహ్మణ్యం, ఆచార సి.హెచ్.రత్నం తదితరులు పాల్గొన్నారు.