ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవితే
ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవితే
ఏయూ రిజిస్ట్రార్ నిరంజన్
ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవితే
సదస్సులో మాట్లాడుతున్న ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య నిరంజన్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కందుల నిరంజన్
అన్నారు. సంగివలస అనిట్స్ ఇంజినీరింగు కళాశాల ఐటీ అండ్ సైన్సు విభాగం, కంప్యూటరు సొసైటీ ఆఫ్ ఇండియా, హీలియోస్ సంయుక్తాధ్వర్యంలో గురువారం ప్రారంభమైన
రేడియంట్ 2కే19 రెండ్రోజుల జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
ఐటీ విద్య సమాజశ్రేయస్సుకి ఉపయోగపడేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.
అనంతరం సావనీర్ని ఆవిష్కరించారు. అనిట్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్బీఆర్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఆచార్య టి.సుబ్రహ్మణ్యం, ఐటీ విభాగాధిపతి సురేశ్ చిట్టినేని, తదితరులు పాల్గొన్నారు.