News

Realestate News

ఐటీలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Andhra Pradesh got a model's make

ఐటీలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
జె.ఎ.చౌదరి

ఈనాడు, విశాఖపట్నం: సమాచార సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం గీతం విశ్వవిద్యాలయంలో పలు బహుళజాతి సంస్థలు, బ్యాంకుల ఉన్నతాధికారులతో ‘ఫిన్‌టెక్‌-బ్లాక్‌ చైన్‌ అకాడమీ’ ఏర్పాటుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ.టి.లో వస్తోన్న మార్పులపై యువతకు అత్యాధునిక పద్ధతుల్లో విస్తృత శిక్షణ ఇచ్చి వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్రప్రభుత్వ లక్ష్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక రంగంతో మేళవిస్తూ భవిష్య అవసరాలకు దీటుగా మానవవనరులను సిద్ధం చేయడానికి రాష్ట్రప్రభుత్వం విశాఖలో ‘ఫిన్‌టెక్‌ అకాడమీ’ని ఏర్పాటుచేస్తోందన్నారు. ఇందులో సంప్రదాయ తరగతి గదులకు భిన్నంగా కేస్‌ స్టడీస్‌తో, లైవ్‌ ప్రాజెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించారు. జాతీయస్థాయిలో పరీక్షలు నిర్వహించి సమర్థులైన యువతను ఎంపికచేసి విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పరిశ్రమల నిపుణులు, కార్పొరేట్‌ సంస్థల నిపుణులు ఇందులో బోధించేలా సిలబస్‌ను రూపొందించాలని సూచించారు. లండన్‌కు చెందిన సి.ఎ.ఎస్‌.ఐ. సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకు ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గీతం వీసీ ఆచార్య ఎం.ఎస్‌.ప్రసాదరావు మాట్లాడుతూ గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేయనున్న ఈ కేంద్రానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే సర్టిఫికెట్‌ కోర్సులు, పి.జి. డిప్లొమో కోర్సులు ప్రారంభించి 2018వ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సులుగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో ఫింటెక్‌ అకాడమీ కోఆర్డినేటర్‌ లెబెన్‌ జాన్సన్‌, ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌’ ప్రతినిధులు అరుణ్‌కుమార్‌, ఉదయ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo