ఏయూ స్నాతకోత్సవం నేడు
ఏయూ స్నాతకోత్సవం నేడు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఏయూ స్నాతకోత్సవం నేడు
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85, 86వ స్నాతకోత్సవం బుధవారం ఉదయం జరగనుంది.
ఇప్పటి వరకు రెండు పర్యాయాలు వాయిదా పడిన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నారు.
గవర్నర్ నరసింహన్ వర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఈ వేడుకలో పాల్గొననున్నారు.
దిల్లీ ఐఐటీ సంచాలకులు ఆచార్య వి.రామ్‌గోపాల్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది.
మొత్తం 546 మందికి డాక్టరేట్, ఆరుగురికి ఎంఫిల్, 573 మందికి మెడల్స్, బహుమతులను ఇవ్వనున్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.
స్నాతకోత్సవ మందిరంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం
ఉదయం పరిశీలించారు. కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది.