News

Realestate News

ఏయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌

ఏయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఏయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌

ఏయూలో డిగ్రీ వార్షిక పరీక్షల (ఏడాదికి ఒక సారి) విధానం 2017తో ముగిసింది.

ఏయూ పరిధిలో 2017 వరకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులు చదివి ఉత్తీర్ణులు కాని విద్యార్థులు సప్లిమెంటరీ

పరీక్ష రాసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల కంట్రోలర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

ఈ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశంగా తెలిపారు.

పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసి ఆయా కళాశాలలకు పంపినట్లు తెలిపారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుధాకర్‌రెడ్డి కోరారు.