ఏయూ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా
ఏయూ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు సోమవారం నుంచి చేపట్టదలచిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.
ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి సోమవారం ఉదయం మరోమారు చర్చలు జరగనున్నాయి.
ఇవి ఫలప్రదమైతే సమ్మెను పూర్తిగా వాయిదా వేస్తామని..
లేని పక్షంలో తిరిగి ఉద్యమం చేస్తామని ఏయూ ఐకాస నాయకులు రవికుమార్ పేర్కొన్నారు.
నవంబరు 26 నుంచి ఏయూ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్షలు చేపట్టగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యోగుల
సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు,
ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, ఇతర అధికారులు, పాలకమండలి సభ్యులతో గడచిన 14 రోజుల్లో పలు పర్యాయాలు చర్చలు జరిపారు.
ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ముందుగా ఆందోళనలు ఆపివేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఐకాస నాయకులు ఆదివారం సాయంత్రం రిలే దీక్షలను స్వచ్ఛందంగా విరమించారు.
సోమవారం నాటి చర్చలతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.