ఏయూ ఉద్యోగుల ఆకలి కేకలుఏయూ ప్రాంగణం, న్యూస్టుడే : ఉద్యోగులకు జీతమే ఆధారం. ఒకటి రెండు నెలలు జీతాలు ఆలస్యమైతే అప్పో సప్పో చేసి నెట్టుకొస్తారు. ఏకంగా ఎనిమిది నెలలు వేతనాలు అందకపోతే ఉద్యోగులు, వారి కుటుంబాలు ఏమి తిని జీవించాలి. జీతాలు రాలేదు అడ్వాన్సులైనా ఇవ్వండి మహా ప్రభో అంటూ ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏయూ అధికారులు కనికరించడం లేదు. పైగా జీతాల నిధులు విడుదలకు సంబంధించి అవసరమైన కొనసాగింపు ఉత్తర్వులను దిల్లీలోని యూజీసీ నుంచి తెచ్చుకోండంటూ ఉచిత సలహాలు ఇస్తుండడంతో ఉద్యోగులకు ఆకలి మంటలతో ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏయూలోని మహిళా అధ్యయన కేంద్రం, సోషల్ ఎక్స్క్లూజివ్, ఇన్ క్లూజివ్ కేంద్రాలు యూజీసీ నిధులతో కొనసాగుతున్నాయి. మహిళా అధ్యయన కేంద్రంలో వినియోగించిన నిధులకు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్) అందివ్వడంలో జాప్యం వల్ల నిధుల విడుదల ఆలస్యమైంది. 2016- 17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూసీలను 2018లో పంపినట్లుగా సమాచారం. ఈ ఇబ్బందులతో నిధుల విడుదల జాప్యమైంది. ఏయూ పరిధిలోనే ఉన్నా నిర్వహణ యూజీసీ నిధులతో జరుగుతుండడంతో ఏయూ నిధులకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చాకే జీతాలు ఇవ్వాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే ఏడు నెలలు గడిచి ఎనిమిదో నెల వస్తోంది. అయినా కదలిక లేదు. అడ్వాన్స్లైనా ఇవ్వాలని ఉద్యోగులు వేడుకుంటున్నా వర్సిటీలో మాకెందుకులే అన్న భావనతోపాటు, నిధులు విడుదల కాకపోతే ఎవరు భరిస్తారన్న యోచనతో వీరి బాధలు పట్టించుకోవడం మానేశారు. సెంటర్ ఫర్ ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్లోను రెండు నెలలుగా జీతాలు విడుదల కావాల్సి ఉంది. వీరికి మార్చి వరకు ఇచ్చారు. ఏప్రిల్, మే నెలల జీతాలు రావాల్సి ఉంది. ఈ ఇబ్బందులపై దృష్టిసారించి ఆకలి బాధలు తీర్చాలని కోరుతున్నారు. వీసీ ఆచార్య నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా యూజీసీ ఉత్తర్వులు రాకపోవడం వల్లే సమస్య నెలకొందన్నారు. పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399