ఏయూ అథ్లెటిక్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఏయూ అథ్లెటిక్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
5 స్వర్ణ, 11 రజత, 13 కాంస్య పతకాలు కైవసం
విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన అంతర కళాశాలల అథ్లెటిక్ పోటీ..
ఈ పోటీల్లో ఐదు స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.సుధాకర్‌బాబు విలేకరులకు తెలిపారు.
మహిళా విభాగంలో ఫాస్టెస్ట్ ఉమెన్ అవార్డును కె.విజయలక్ష్మి పొందారు.
29 పతకాలు సాధించి కళాశాలకు ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులను వ్యవస్థాపకులు వనుము శ్రీనివాసరావు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు
టీవీవీ సత్యనారాయణ, గొంప అయ్యన్న, బోధన సిబ్బంది, సహచర విద్యార్థులు అభినందించారు.
ఇందులో పొలవెంట్లో స్వర్ణం, డెకాత్లన్లో కాంస్యం, హైజంప్‌లో విజయరాజ్(కాంస్యం), ట్రిపుల్ జంప్‌లో నాయక్ (రజతం), ఆఫ్మోషన్,
పుక్వెంట్లో ఎస్.అర్జున్ (రజతం), రేస్‌వాకింగ్‌లో కె.పవన్‌కుమార్ (రజతం), డి.సింహాచలం లాంగ్‌జంప్‌లో(రజతం),
జావిలిన్లో(కాంస్యం), షాట్‌పుట్, జావిలిన్లో పి.భవాణి స్వర్ణ పతకాలు, కె.భవాణి డిస్కస్‌లో(స్వర్ణం), హేమర్లో(రజతం), జి.భవాణి
హెప్తాథిన్లో(రజతం), 400 మీటర్లు హర్డిల్స్‌లో కాంస్య పతకాలు, బి.లావణ్య 100 మీటర్లు హార్డిల్స్‌లో కాంస్యం,
బి.మంగమ్మ 5000 మీటర్లు 1000 మీటర్లులో కాంస్యం, దేవిక 2000 మీటర్లు, జావిలిన్లో కాంస్యం,
ప్రమీల హేమర్ త్రోలో కాంస్యం, ఎం.దివ్య రేస్‌వాక్‌లో రజతం, ఎం.అనురాధ హైజంప్‌లో రజతం,
ఎం.విజయలక్ష్మి 100 మీటర్లలో స్వర్ణ పతకం సాధించారని వివరించారు.
బృంద విభాగంలో 4×400 మీటర్లులో మహిళలు రజతం, పురుషుల విభాగంలో కాంస్య పతకాలు సాధించారు.