ఏయూలో కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం
ఏయూలో కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం

ఏయూలో కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం
ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఆల్ ఇండియా యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
పోటీలను వీసీ ఆచార్య నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు.
ఏయూ నూతన జిమ్నాజియంలో విశాఖ పోర్టు ట్రస్టు ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈనెల 11వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు.
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏయూ జట్టు ప్రథమ
స్థానంలో నిలిచిందన్నారు.
బాక్సింగ్, బాల్‌బ్యాడ్మింటన్, స్కేటింగ్ పోటీల్లోనూ క్రీడాకారులు ప్రతిభ చూపారన్నారు.
ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ హెడ్ ఆచార్య ఎన్.విజయమోహన్ మాట్లాడుతూ దేశంలోని 34 యూనివర్సిటీల నుంచి 300లకు పైగా క్రీడాకారులు,
100 మంది అధికారులు బాక్సింగ్ పోటీలకు హాజరయ్యారన్నారు.
కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆచార్య కె.రామ్మోహనరావు,
ఆచార్యులు డాక్టర్ ఎ.పల్లవి, డాక్టర్ చిన్నారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ జి.ఎస్.వర్మ, డాక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.